Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:02 PM

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా

18-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి చివెంల మండల అధ్యక్షుడు ధరావత్ వెంకన్న నాయక్, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు గాజుల వెంకన్న, పెనపహాడ్ మండల అధ్యక్షుడు శెట్టిపల్లి సైదులు ధీమా వ్యక్తం చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్కు వద్ద మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న అనేక మంది నాయకులు నేడు మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఎదిగి తమ రాజకీయ జీవితాలను ఉన్నతంగా మార్చుకున్నారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘన చరిత్ర ఎన్టీఆర్‌కే దక్కిందని వారు తెలిపారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి, అనుభవం ఉన్న పార్టీ టిడిపియేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోవిందా చారి, రామాచారి, నర్సింగ్ నాగయ్య, గుంటి కృష్ణ, బాణాల రాము, నకిరేకంటూ ఉపేందర్ పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం – టిడిపి నాయకుల ధీమా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News