Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:29 PM

రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం

25-01-2026 173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో తన సత్తా చాటింది. ఎన్నికల నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు రాష్ట్రస్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ ఎన్నికల విధానాల విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా ప్రకటించారు.పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఎన్నికల నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ హనుమంత రావు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నిర్వహించినందుకు జిల్లాకు ఈ గుర్తింపు లభించింది. ఓటర్ల అవగాహన, పోలింగ్ శాతం పెంపు, ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణ వంటి అంశాల్లో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని ఎన్నికల అధికారులు ప్రశంసించారు.ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతీ ఉద్యోగికి అభినందనలు తెలిపారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే జిల్లాకు ఈ గౌరవం దక్కిందని పేర్కొన్నారు.రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరికి అరుదైన గౌరవం కలెక్టర్ హనుమంత రావుకు ఉత్తమ ఎన్నికల పురస్కారం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News