Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:31 AM

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత

07-01-2026 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా రామన్నపేటలో అవగాహన సదస్సు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి. సబిత సూచించారు. రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, కాలినడకన వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారని, 18 సంవత్సరాలు దాటినవారే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే తల్లిదండ్రులు కూడా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గమనిస్తూ రోడ్డు దాటాలని, సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలు నడపాలని సూచించారు.అనంతరం రోడ్డు రవాణా భద్రత మాసోత్సవాల సందర్భంగా హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు హర్షవర్ధన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, తహశీల్దార్ లాల్ బహుదూర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.ఏ. మసీద్, ఏజీపి సుక్క శ్రావణ్ కుమార్, సీనియర్ అడ్వకేట్ జినుకల ప్రభాకర్, ప్యానల్ అడ్వకేట్‌లు బి. డేవిడ్, మామిడి వెంకట్ రెడ్డి, ఇతర అడ్వకేట్లు, విద్యాశాఖ అధికారులు, పోలీస్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. జగదీష్, వివిధ పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News