Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:16 AM

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

11-01-2026 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బస్సు రూట్ మార్చి సేవ లు ప్రారంభించండి
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట నుంచి సిరిపురం, ఎల్లంకి మీదుగా చౌటుప్పల్ వెళ్లే ఆర్టీసీ బస్సు సేవలు మూడు నాళ్ల ముచ్చటగానే మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక కారణం చెప్పి తరచూ ఈ సెటిల్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.రామన్నపేట రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించడం స్వాగతార్హమేనని, అయితే అదే వంకతో బస్సు సేవలను పూర్తిగా నిలిపివేయడం ప్రజలకు అన్యాయమని స్థానికులు అంటున్నారు. అవసరమైతే బోగారం మీదుగా అయినా బస్సును నడిపే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పండుగ సమయాల్లో బస్సు లేకపోవడం వల్ల ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో రామన్నపేట నుంచి బోగారం, సిరిపురం, ఎల్లంకి మీదుగా చౌటుప్పల్‌కు బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నకు, నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపో ఇన్‌చార్జ్ మేనేజర్‌కు తెలుగుదేశం పార్టీ నాయకుడు పోచబోయిన మల్లేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Sthanikam

రామన్నపేట–చౌటుప్పల్ బస్సు నిలిపివేతతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News