Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:18 PM

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు

19-01-2026 284 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట పట్టణంలో రోడ్ సేఫ్టీపై ట్రావెల్స్ యజమానులు, వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రామన్నపేట సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగరాజు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలియజేశారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది వికలాంగులుగా మారడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. రహదారులపై జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ట్రావెల్స్ నిర్వాహకులు, వాహనదారులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో రోడ్ సేఫ్టీపై అవగాహన.ఎస్‌ఐ నాగరాజు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News