Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:18 PM

రామన్నపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

18-01-2026 316 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పేదల పెన్నిధి, బడుగు–బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను రామన్నపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామన్నపేట ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవీయతను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రామన్నపేట మండల నాయకులు ఎం. ఫజల్, బత్తుల సత్తయ్య మాట్లాడారు. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతోనే పేదలకు రాజకీయ స్వేచ్ఛ, ఆత్మగౌరవం లభించాయని వారు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో విస్తృత అవకాశాలు కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే, పాలనా దక్షతతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల దేవుడిగా ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, మండల వ్యవస్థ ఏర్పాటు, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు నేటికీ కొనసాగుతున్నాయంటే అది ఎన్టీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం. ప్రజల్, బత్తుల సత్తయ్య, పోచబోయిన మల్లేశం, ఉప్పల ప్రభాకర్, ఉప్పల సత్యనారాయణ, గంజి వీరయ్య, కట్ట మహేందర్, ఎండి సువియాన్, లింగస్వామి తదితర టీడీపీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News