Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం

13-04-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటను తిరిగి నియోజకవర్గంగా పునరుద్ధరించాలని మునిపంపుల గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రామన్నపేట ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, మునిసిపాలిటీగా ఉండి 1952 నుంచి 2009 వరకు నియోజకవర్గంగా ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. అనంతరం రద్దు చేసి నకిరేకల్ నియోజకవర్గంలో కలపడంతో అభివృద్ధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాంతం తన స్వరూపాన్ని కోల్పోయిందని అన్నారు.

ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామన్నపేటను మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు ఇప్పటికే రామన్నపేటలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

నియోజకవర్గ పునరుద్ధరణ కోసం చేపట్టే పోరాటంలో గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, వార్డు సభ్యులు యాదాసు మంగమ్మ, యాదాసు లక్ష్మణ్ కుమార్, మేకల రాములు, కూనూరు లక్ష్మమ్మ, గంటపాక శ్రీను, బూడిద నర్మద, నీల రజిత, మేకల జలంధర్, కట్ట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు ఏకగ్రీవ తీర్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News