Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:52 PM

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’

21-01-2026 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో విస్తృత అవగాహన

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ను రామన్నపేట మండలంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఐ ఎన్ వెంకటేశ్వర్లు ఎస్‌ఐ డి నాగరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా అమలు చేస్తున్నారు.ఈ సందర్భంగా వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, రామన్నపేట ట్రావెల్స్ యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాల్సిందేనని సూచించారు.

అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు.

Sthanikam

రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News