Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో రోగుల ఇక్కట్లు ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోత.. ప్రమాదకరంగా స్విచ్‌బోర్డులు

22-05-2026 278 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిధులు ఉన్నా రోగులకు తప్పని ఇబ్బందులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత రోగులకు శాపంగా మారింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వార్డుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పేషంట్లు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.

పురుషుల వార్డులో ఫ్యాన్లు తిరగకపోవడంతో పాటు స్విచ్‌బోర్డులు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయని రోగులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఫ్యాన్లు పనిచేయడం లేదని, ఎండదెబ్బతో ఆస్పత్రికి వస్తే ఇక్కడ మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆస్పత్రికి సంబంధించిన మడిగల కిరాయిల రూపంలో ఇటీవల కాలంలో ఏప్రిల్ 16 వరకు రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎండాకాలం ముగిసే వరకు వార్డుల్లో కూలర్లు ఏర్పాటు చేసి, స్విచ్‌బోర్డులు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో రోగుల ఇక్కట్లు ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోత.. ప్రమాదకరంగా స్విచ్‌బోర్డులు

Article Image

నిధులు ఉన్నా రోగులకు తప్పని ఇబ్బందులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత రోగులకు శాపంగా మారింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వార్డుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పేషంట్లు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.

పురుషుల వార్డులో ఫ్యాన్లు తిరగకపోవడంతో పాటు స్విచ్‌బోర్డులు దెబ్బతిని ప్రమాదకరంగా మారాయని రోగులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఫ్యాన్లు పనిచేయడం లేదని, ఎండదెబ్బతో ఆస్పత్రికి వస్తే ఇక్కడ మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆస్పత్రికి సంబంధించిన మడిగల కిరాయిల రూపంలో ఇటీవల కాలంలో ఏప్రిల్ 16 వరకు రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎండాకాలం ముగిసే వరకు వార్డుల్లో కూలర్లు ఏర్పాటు చేసి, స్విచ్‌బోర్డులు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News