Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

రైతులకు మద్దతుగా ప్రత్యేక ప్రోత్సాహాలు – తీగల గిరిధర్ రెడ్డి

13-04-2026 196 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి: మండలంలోని అన్నారంగ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి , వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు ఈ ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నదని తెలిపారు. రైతుల వద్దే ధాన్యం కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు అందించే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు.అందువల్ల రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద కప్పే సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తేమ పదిహేడు శాతం ఉండేలా చూడాలని, బస్తా నలభై ఒక కిలోలకే తూకం వేయాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రైతులు, పాలకవర్గ సభ్యులు, ఐజేపి నీర్వాకులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు మద్దతుగా ప్రత్యేక ప్రోత్సాహాలు – తీగల గిరిధర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News