Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:52 PM

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
08-06-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజిగూడెంలో లక్ష బస్తాల సామర్థ్యంతో నూతన గోదాం ప్రారంభం

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ, వారికి నిరంతరం అండదండగా నిలుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య స్పష్టం చేశారు. సోమవారం చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా నూతనంగా నిర్మించిన గోదాంను స్థానిక సర్పంచ్ జువ్వి నర్సింహ్మతో కలిసి ఆయన ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ప్రతి రైతు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనుగోళ్లు చాలా వేగవంతంగా సాగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు."రైతులకు నిల్వ సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ నూతన గోదామును అందుబాటులోకి తెచ్చాం. దీని సామర్థ్యం దాదాపు లక్ష ధాన్యం బస్తాల వరకు ఉంటుంది. వర్షాలు, ఇతర ఇబ్బందుల నుండి రైతులు తమ పంటను ఇక్కడ భద్రపరుచుకోవచ్చు."ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ భార్గవ్, ఐతరాజు లింగస్వామి, ఊదరి స్వామి, ఐతరాజు శివ, ఏపీఎం యాదయ్య, జీపీవో గాలయ్య, బద్రి గణేష్, స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News