Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వంతోనే ప్రభుత్వ లాభాలు. సర్పంచ్ సాయికుమార్

25-01-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారంలో అవగాహన సదస్సు

గ్రామ సర్పంచ్ స్వయంగా సభ్యత్వం .

రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు చేరువ చేసే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వ స్వీకరణపై అవగాహన సదస్సు గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి

ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ హాజరై మాట్లాడుతూ, సింగిల్ విండో పరిధిలో ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు.సభ్యత్వం ఉన్న రైతులకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీలు, వ్యవసాయాభివృద్ధి పథకాలు పూర్తిస్థాయిలో అందుతాయని స్పష్టం చేశారు. రైతులు చెల్లించే సభ్యత్వ రుసుముకు ప్రభుత్వం నుండి రెండింతల మద్దతు లభిస్తుందని తెలిపారు.రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అవసరాలు సులభంగా అందడంతో పాటు రైతుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే గ్రామంలోని ప్రతి రైతు సభ్యత్వం తీసుకుని సంస్థలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం సంఘ సీఈఓ జంగారెడ్డి మాట్లాడుతూ, సభ్యత్వం కలిగిన రైతులు మరణ సభ్యత్వం కూడా తీసుకోవడం ద్వారా కుటుంబానికి భద్రత లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిబ్బంది రాములు, రైతులు అంతటి మల్లేశం గౌడ్, ఇప్ప పాండురంగారెడ్డి, కట్ట దశావతారెడ్డి, కడారి పాపయ్య, నేరటి రమేష్, బైకాని మహేష్, గోగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వంతోనే ప్రభుత్వ లాభాలు. సర్పంచ్ సాయికుమార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News