Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:50 PM

రైతు సంఘం పోరాట ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

23-01-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సాగిన పోరాటాల ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఆదోని మండలంలో రైతులు పండించిన కంది పంట మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేడీసీఎంఎస్ అధికారులకు అనుమతి ఇచ్చిందని రైతు సంఘం సీనియర్ నాయకులు కే. లక్ష్మిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్, సిపిఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు తెలిపారు.

స్థానిక ఆదోని మార్కెట్ యార్డులో కొద్ది రోజులుగా కొనసాగుతున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల మధ్య రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అధికారులు నాణ్యత లేదని, తాలు, తబకలు, గింజలు పుచ్చు పట్టాయని రకరకాల పేర్లు పెట్టి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం రైతులకు ఒక మాట, అధికారులకు మరో మాట చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకోకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.రైతులు తీసుకొచ్చిన కందులను నాణ్యత పేరుతో తిరస్కరించి చిత్రహింసలకు గురి చేస్తే కొనుగోలు కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

రైతు సంఘం పోరాట ఫలితంగానే కందుల కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News