Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:58 AM

‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్

24-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: రైతుల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఈ నెల 26 నుంచి ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరుతో యాత్ర చేపట్టనుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర జిల్లా మీదుగా వివిధ మండలాల్లో కొనసాగుతుందని చెప్పారు. రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితులను తెలుసుకుంటామని పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు రైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడిస్తామని, తమకు ముఖ్యంగా రైతుల సంక్షేమమే లక్ష్యమని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ యాత్రను విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి, భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, పాదరాజు ఉమాశంకర్, బబ్బూరి సురేష్, మండల అధ్యక్షుడు చిరిక సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్రకు సన్నాహాలు కాంగ్రెస్ హామీలు వెంటనే అమలు చేయాలి: వేముల అశోక్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News