Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:18 AM

రెండేళ్ల విరామానికి బ్రేక్… నిదానపల్లిలో తిరిగి మొదలైన చెత్త ట్రాక్టర్

09-01-2026 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ పరిశుభ్రతకు శ్రీకారం… నిదానపల్లిలో చెత్త ట్రాక్టర్ ప్రారంభం

స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో చెత్త ట్రాక్టర్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

గత రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో నిధుల కొరత కారణంగా చెత్త ట్రాక్టర్ నిర్వీర్యంగా ఉండటంతో గ్రామంలో పారిశుధ్య సమస్యలు తలెత్తాయి.కొత్త సంవత్సరం సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రత్యేక ప్రణాళికలతో శుక్రవారం చెత్త ట్రాక్టర్‌ను గ్రామ వీధుల్లోకి తీసుకువచ్చారు. ట్రాక్టర్‌తో పాటు చెత్త బండిని గ్రామమంతా తిప్పుతూ,

“చెత్త బండి వచ్చిందమ్మా… చెత్తను డాక్టర్లలో వేయండి” అనే ఆసక్తికరమైన పాటలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం గ్రామంలో మంచి స్పందన పొందింది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని సర్పంచ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేయడం ద్వారా ఆరోగ్యకరమైన గ్రామాన్ని నిర్మించవచ్చని తెలిపారు.చెత్త ట్రాక్టర్ సేవలు పునఃప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పరిశుభ్రతతో పాటు గ్రామాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగుగా గ్రామస్తులు అభిప్రాయపడ్డారు

Sthanikam

రెండేళ్ల విరామానికి బ్రేక్… నిదానపల్లిలో తిరిగి మొదలైన చెత్త ట్రాక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News