Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:26 AM

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం
07-01-2026 204 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 బండిల్స్ – నిందితుడిపై కేసు నమోదు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట గ్రామానికి చెందిన కావేటి సతీష్ (తండ్రి: బాలనరసింహ) తన ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసుల తనిఖీల్లో 10 బండిల్స్ చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు.స్థానిక ఎస్‌ఐ డి. నాగరాజు ఆదేశాల మేరకు రామన్నపేట పోలీసు సిబ్బంది ప్రశాంత్, రాఘవేందర్‌లు మంగళవారం సాయంత్రం నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత చైనా మాంజా భారీగా లభ్యమైంది. చైనా మాంజాను అమ్మడం గానీ, నిల్వ ఉంచడం గానీ చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కావేటి సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ డి. నాగరాజు వెల్లడించారు. రామన్నపేట మండలంలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను కలిగి ఉన్నా, నిల్వ చేసినా లేదా విక్రయించినా వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Sthanikam

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News