Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 AM

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

07-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు–2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట మండలం కక్కిరేణి, జనంపల్లి గ్రామాల్లో జీవో కాపీని దహనం చేశారు. అనంతరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ కరపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా వనం ఉపేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికుల ఉపాధిని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటికే నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వంటి కారణాలతో వికలాంగులకు ఉపాధి రోజులు తగ్గాయని తెలిపారు. VB-GRAMG బిల్లు అమలైతే వికలాంగులు మరింత పేదరికంలోకి నెట్టబడతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు పున్న శ్రీధర్, మేడబోయిన రమేష్, చెప్పరి చంద్రయ్య, వరికుప్పల యాదయ్య, సుంకి వెంకటేశం, అక్కెనపల్లి మహేష్, కక్కిరేణి గ్రామ అధ్యక్షురాలు కన్నేబోయిన మంగమ్మ, చిల్ల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండలంలో జీవో కాపీ దహనం – బిల్లు రద్దు వరకు ఉద్యమం: వనం ఉపేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News