Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:36 AM

“ప్రతి నియోజకవర్గానికి జర్నలిస్టులకే కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలి: సత్యం గౌడ్ డిమాండ్”

13-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జన సమస్యల పరిష్కారంలో నిస్వార్థ సేవకులుగా పనిచేసిన జర్నలిస్టులకే రాజకీయ అవకాశం కావాలి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
హైదరాబాద్: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, భాగ్యనగర్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం గౌడ్ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక జర్నలిస్టుకు కార్పొరేటర్ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జనసేవలో, అభివృద్ధిలో, ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తారని, రాజకీయంగా వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు. సత్యం గౌడ్ చెప్పారు: "ప్రతి సమస్యను మొదట గుర్తించే, పరిష్కరించే కాళ్లు జర్నలిస్టులు మాత్రమే. వాళ్ల సూచనలే అధికారుల విధులనూ, ప్రజా ప్రతినిధుల చర్యలనూ దిశనిర్దేశం చేస్తాయి."
ప్రత్యేకంగా గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించగల సామర్థ్యం జర్నలిస్టుల వద్దే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యూనిఫామ్, జీతాలు లేకున్నా నిస్వార్ధంగా పనిచేసే ఈ సర్వీస్ వర్కర్లను రాజకీయంగా ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించవచ్చని చెప్పారు.ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాలకు పరిమితం అయిన అవకాశాలను, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు సమాన అవకాశాలు ఇవ్వాలని, దాంతో రాజకీయాల్లో పారదర్శకత, అభివృద్ధి పెరుగుతుందని సత్యం గౌడ్ సూచించారు.ఈ డిమాండ్ రాజకీయ పార్టీలు ఎలా స్వీకరిస్తారో, నిజానికి జర్నలిస్టులకు వాస్తవంగా ఎలాంటి అవకాశాలు లభిస్తాయో రాబోయే రోజులలో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Sthanikam

“ప్రతి నియోజకవర్గానికి జర్నలిస్టులకే కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వాలి: సత్యం గౌడ్ డిమాండ్”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News