Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం

14-01-2026 260 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అద్దె భవనాల్లోని కార్యాలయాల స్థానంలో సొంత భవనాల వినియోగం

రామన్నపేట (స్థానిక ప్రతినిధి):

ప్రభుత్వంపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తహసిల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల సంవత్సరానికి సుమారు రూ.8 వేల కోట్ల మేర ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఆదేశాల ప్రకారం మండల పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి, ప్రభుత్వ సొంత భవనాల్లోకి తరలించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ, ఎస్సీ బాలుర వసతి గృహం, ఆర్ అండ్ బి శాఖ, రిజిస్ట్రేషన్ కార్యాలయం తదితర కార్యాలయాల కోసం అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.ఎంపీడీవో ఆవుల రాములు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పరిశీలన అనంతరం, గుర్తించిన భవనాలకు అవసరమైన మరమ్మతుల కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మరమ్మతుల పనులు పూర్తయిన వెంటనే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి తరలిస్తామని స్పష్టం చేశారు.ఈ చర్యల ద్వారా అద్దె ఖర్చులను పూర్తిగా ఆదా చేసి, ప్రభుత్వ నిధులను ప్రజా సంక్షేమానికి మరింత సమర్థవంతంగా వినియోగించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, గోదాసు పృథ్వీ, గుత్తా నర్సిరెడ్డి, బొడ్డు సురేందర్రావు, ఎండి నాసర్, ఉప సర్పంచ్ మోటే రమేష్, గొరిగే శేఖర్, కొమ్ము శేఖర్, మోటి మహేష్, ఎండి జమీరుద్దీన్, ఎండి ఆక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News