Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

16-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.శుక్రవారం ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల లభ్యతను పరిశీలించారు. రోజువారీ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, గర్భిణీ స్త్రీల చెకప్‌లు, నెలవారీ డెలివరీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు.

ఆశా కార్యకర్తలు గర్భిణీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి సమయానికి చెకప్‌లు చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై కూడా ఆరా తీశారు.ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News