Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:29 PM

పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు

18-01-2026 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం–రామన్నపేట ప్రధాన రహదారిపై పొలాల నుంచి వచ్చిన నీరు తరచూ రోడ్డుమీదికి చేరుతుండటంతో ప్రయాణికుల సహనం పరీక్షకు నిలుస్తోంది. సాగునీరు రోడ్డంతా వ్యాపించడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉండగా, ఆటో-కారు ప్రయాణికులు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది.అసిఫ్ నగర్ కాలువకు ఆనుకుని ఉన్న పొలాల్లో కొందరు రైతులు మోతాదుకు మించి నీటిని వినియోగించడం వల్లే ఈ సమస్య ఉధృతమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై నిరంతర నీటి ప్రవాహం కొనసాగితే బీటీ రోడ్డు త్వరలోనే దెబ్బతిని, మరమ్మతులకు భారీ వ్యయం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇకపోతే పొలాల వరద నీరు రోడ్డుపైకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు రైతులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ట్రాక్టర్ క్రేజీ వీల్స్ రోడ్డుపై ప్రయాణించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పొలాల నీరు రోడ్డుపైకి… లక్ష్మాపురం–రామన్నపేట రహదారిపై ప్రయాణికుల అవస్థలు

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం–రామన్నపేట ప్రధాన రహదారిపై పొలాల నుంచి వచ్చిన నీరు తరచూ రోడ్డుమీదికి చేరుతుండటంతో ప్రయాణికుల సహనం పరీక్షకు నిలుస్తోంది. సాగునీరు రోడ్డంతా వ్యాపించడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉండగా, ఆటో-కారు ప్రయాణికులు నెమ్మదిగా సాగాల్సిన పరిస్థితి నెలకొంది.అసిఫ్ నగర్ కాలువకు ఆనుకుని ఉన్న పొలాల్లో కొందరు రైతులు మోతాదుకు మించి నీటిని వినియోగించడం వల్లే ఈ సమస్య ఉధృతమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై నిరంతర నీటి ప్రవాహం కొనసాగితే బీటీ రోడ్డు త్వరలోనే దెబ్బతిని, మరమ్మతులకు భారీ వ్యయం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇకపోతే పొలాల వరద నీరు రోడ్డుపైకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు రైతులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే ట్రాక్టర్ క్రేజీ వీల్స్ రోడ్డుపై ప్రయాణించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News