Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:36 PM

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా
27-01-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ఆర్థిక భద్రతకు నాంది

స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల ఆర్థిక భద్రత లక్ష్యంగా “రోజుకు ఒక రూపాయి” ఆర్థిక భరోసా పథకానికి సంబంధించిన పోస్టర్, బాండ్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ పథకం ద్వారా జిల్లాలోని ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అనుకోని పరిస్థితుల్లో వారి కుటుంబాలకు కూడా భరోసా కల్పించాలన్నదే లక్ష్యమని సంఘ నాయకులు తెలిపారు. సభ్యుల ఐక్యత, పరస్పర సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భోగ చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లా హరిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యమల అప్పలరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు చాట్లపల్లి సిద్ధు, పందిరి రమేష్, జిల్లా పీఆర్‌వో భేతి రవికుమార్, రామన్నపేట ప్రచార కార్యదర్శి భాషమల్ల సంతోష్ కుమార్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రే శ్యామ్, ప్రధాన కార్యదర్శి కందోజు రవికిరణ్, భోగ శేఖర్, సంతోష్, స్వామి నాయక్‌తో పాటు మండల ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి ఈ ఆర్థిక భరోసా పథకం దిశానిర్దేశకంగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

ఫోటోగ్రాఫర్లకు రోజుకు ఒక రూపాయి భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News