Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:25 PM

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

28-01-2026 204 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న ఒక్కరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనుందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకరేకంటి రాము ప్రకటించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు మండల కేంద్రంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీకి సమ్మె నోటీసులు అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులంతా సమ్మెలో పాల్గొని తమ హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు.కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని, 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని శాశ్వతీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు, ఐదు లక్షల రూపాయల బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆన్లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని, మరణించిన కార్మికుల అంత్యక్రియలకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, మండల అధ్యక్షులు గాదె ఎల్లయ్య, నాయకులు బొడ్డు సాలయ్య, గాదె చంద్రయ్య, కాడే యాదమ్మ, మొలకలపల్లి జయమ్మ, నకరేకంటి ప్రమీల, గాదె భారతమ్మ, నకరేకంటి కిష్టయ్య, గొర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె – గ్రామ పంచాయతీ కార్మికుల సమరభేరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News