Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:21 PM

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి.ఎమ్మెల్యే వేముల వీరేశం

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి.ఎమ్మెల్యే వేముల వీరేశం

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి.ఎమ్మెల్యే వేముల వీరేశం
January 22, 2026 06:41 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో 212 మంది లబ్ధిదారులకు రూ.90.87 లక్షల చెక్కుల పంపిణీ

నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.18.24 కోట్ల CMRF పంపిణీ: ఎమ్మెల్యే వేముల వీరేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి

పేదల కష్టాలకు ఆసరాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 212 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.90 లక్షల 87 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం రూ.18 కోట్ల 24 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు అందజేశామని తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు CMRF నిజంగా వరంగా మారిందన్నారు.

ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ట్రామా కేర్ సెంటర్, సిటీ స్కాన్ సౌకర్యాలను ఏర్పాటు చేశామని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదల కష్టాలను అర్థం చేసుకుని సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇండ్లను కేటాయించామని, మార్చి నెలలో మరో 3,500 ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.

CMRF చెక్కులు అందుకున్న 212 మంది లబ్ధిదారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు గుత్తా మంజుల–మాధవ్ రెడ్డి, నర్రా వినోద్–మోహన్ రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News