Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం

10-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వాతంత్ర సమరయోధులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పాలవరపు రాములమ్మ లక్ష్మీనరసయ్య, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు విశ్రాంత ఉపాధ్యాయుడు ఓరుగంటి సత్యనారాయణ ల జ్ఞాపకార్థం వారి కుమారులు పాలవరపు సంతోష్, ఓరుగంటి సుభాష్, ఓరుగంటి శ్రీనివాస్ ల సహకారంతో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని విశ్రాంతి ఉపాధ్యాయుల భవనంలో మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. లైన్స్ క్లబ్ తుంగతుర్తి మండల శాఖ అధ్యక్షులు పాలవరపు సంతోష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ రేపాల మదన్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ శిబిరంలో గుండెకు సంబంధించిన వ్యాధులు, షుగర్, బీపీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ వంటి దీర్ఘకాలిక రోగాల పై ప్రత్యేకంగా సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాదులోని యశోద హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన సూచనలు అందించారు.ఈ వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు వెల్లడించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువ వికాసం కార్యక్రమా నిర్వహించి విద్యార్థులకు పదవ తరగతి పరీక్షల పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి గట్టుపల్లి అశోక్ రెడ్డి, రీజియన్ చైర్మన్ కొండ సంతోష్ కుమార్, జోనల్ చైర్మన్ కొండపల్లి లక్ష్మారెడ్డి, లైన్స్ క్లబ్ తుంగతుర్తి మండల ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి,కార్యదర్శి పులుసు వెంకన్న, కోశాధికారి గుండగాని రాము, సంయుక్త కార్యదర్శి ఎనగందుల గిరి, సభ్యులు దుగ్యాల రవీందర్ రావు, కేతిరెడ్డి లతా విజయ కుమార్ రెడ్డి, కేతి రెడ్డి రవీందర్ రెడ్డి,వంగాల వెంకన్న, డాక్టర్ చారి, గుజ్జ భాస్కర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లైన్స్ క్లబ్ లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News