Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:47 AM

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన

22-02-2026 246 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ – రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో పేదల సొంతింటి కల నిజమైంది. దుండిగల రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పేదల మొహంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. పేదలకు సొంత ఇల్లు అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు కాలం గడిపిందని, కానీ ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి పేదల ఆశలను నెరవేర్చిందని గుర్తుచేశారు. ప్రతి ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని, సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పేదల సొంతింటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News