చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అర్చకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిదివ్యకల్యాణోత్సవాన్నిదర్శించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని భక్తి పరవశం కనిపించింది.
PRINT TIME: October 09, 2026 01:14 PM
పెద్దకాపర్తిలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా

26-02-2026
27 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అర్చకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిదివ్యకల్యాణోత్సవాన్నిదర్శించుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని భక్తి పరవశం కనిపించింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి