Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:54 AM

పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టిన వార్డు సభ్యుడు ముత్యాల కిషన్

19-01-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగలమని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత వహించాలని నీర్నెముల గ్రామ 6వ వార్డు సభ్యుడు ముత్యాల కిషన్ అన్నారు. సోమవారం 6వ వార్డులో పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన స్వయంగా చీపురు పట్టి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు.

ఈ సందర్భంగా ముత్యాల కిషన్ మాట్లాడుతూ, మన ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. చెత్తను కాలువల్లో, రోడ్ల పక్కన వేయకుండా పారిశుధ్య కార్మికులు ఇంటివద్దకు వచ్చినప్పుడే అప్పగించాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యాధుల నివారణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి ఇవ్వాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కార్మికులు తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని వారికి సూచించారు.వార్డు సభ్యుడు పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముత్యాల కిషన్‌ను అభినందించారు.

Sthanikam

పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టిన వార్డు సభ్యుడు ముత్యాల కిషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News