Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి: కొండూరి వెంకటేష్

17-03-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్థానిక యువతకు ఉపాధి కల్పించకపోతే ఆందోళనలు తీవ్రం

చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా స్థానికులు ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రాంతంలోనే పరిశ్రమలు ఉన్నప్పటికీ బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని పంట పొలాలు, బూగర్భ జలాలు పరిశ్రమల వల్ల తీవ్రంగా కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. రసాయన పరిశ్రమలు వ్యర్థాలను యథేచ్ఛగా పారబోస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రజలు ఊరుకోరని, భవిష్యత్తులో తీవ్ర ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, గుండెబోయిన భాస్కర్, ఉడుత రాజు, దాసరి సిద్దు, రాంచరణ్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి: కొండూరి వెంకటేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News