Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:53 PM

పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తుల భాగస్వామ్యం తప్పనిసరి : సర్పంచ్ వెంకటేశం

20-01-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మునిపంపుల, స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామ పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడంలో గ్రామ ప్రజలందరూ బాధ్యతాయుతంగా భాగస్వామ్యం కావాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు. స్వచ్ఛ గ్రామ లక్ష్యంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన శుభ్రత కార్యక్రమంలో భాగంగా ఒకటవ వార్డులో పేరుకుపోయిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి, మూసుకుపోయిన రహదారులను జేసీబీ సహాయంతో శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ చెత్త ట్రాక్టర్‌లోనే వేయాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన పెంట దిబ్బలు, పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన జీవనానికి పునాదని తెలిపారు.

ప్రధాన వీధులు, ప్రజా ప్రదేశాల శుభ్రతకు గ్రామపంచాయతీ నిరంతరం చర్యలు తీసుకుంటోందని, గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అత్యవసరమన్నారు. పరిసరాల పరిశుభ్రతలో గ్రామ ప్రజలందరూ భాగస్వామ్యం అయినప్పుడే గ్రామం ఆరోగ్యకరంగా, ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గత పది రోజులుగా మూసుకుపోయిన ప్రధాన వీధులను శుభ్రం చేస్తూ నిరంతర పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.గ్రామంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ వెంకటేశానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తాళ్ళ క్రాంతి కుమార్, వార్డు సభ్యులు యాదాసు మంగమ్మ నర్సింహ, యాదాసు లక్ష్మణ్, గ్రామస్తులు ఎండీ మైనొద్దీన్, కూనూరు లింగస్వామి, సప్పిడి భగవంత్ రెడ్డి, నోముల నర్సిరెడ్డి, ఎండీ బద్రోద్దీన్, శానగొండ శ్రీధర్, ఉయ్యాల స్టాలిన్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, కనుకుంట్ల భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తుల భాగస్వామ్యం తప్పనిసరి : సర్పంచ్ వెంకటేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News