Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. దుంబాల వెంకట్ రెడ్డి బీర్ల శంకర్

13-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నామని తెలిపారు.ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

“ప్రాణం విలువైనది కుటుంబానికి మీరు అవసరం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. యువత ముఖ్యంగా వేగానికి లోనుకాకుండా బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మానుకోవాలని హెచ్చరించారు.ప్రభుత్వం ప్రజల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే హెల్మెట్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కూడా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం చాలా అవసరమని చెప్పారు.అలాగే, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సైదాపురం ఉపసర్పంచ్ దుంబాల వెంకటరెడ్డి బీర్ల శంకర్ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాస్ నాయుడు టౌన్ సిఐ భాస్కర్ రూలర్ సిఐ శంకర్ గౌడ్ ట్రాఫిక్ సిఐ కృష్ణ తాసిల్దార్ గణేష్ నాయక్ ఎంపీడీవో నవీన్ కుమార్ సర్పంచ్ రోజా దర్శన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. దుంబాల వెంకట్ రెడ్డి బీర్ల శంకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News