Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:36 PM

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

27-01-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిజిటల్ బోధనతో భవిష్యత్‌కు బాటలు..!

రామన్నపేట, స్థానిక ప్రధాన ప్రతినిధి

విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తే పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవగలరని వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోధన కోసం స్మార్ట్ టీవీని ఏర్పాటు చేశారు.గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి తన సొంత నిధులతో రూ.30 వేల వ్యయంతో స్మార్ట్ టీవీని సమకూర్చగా, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి చేతులమీదుగా పాఠశాలకు బహుకరించారు.ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ విద్య ద్వారా విద్యార్థులకు ఆడియో–విజువల్ లెర్నింగ్ సదుపాయాలు లభిస్తాయని, జాతీయ స్థాయి పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇది విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, మేధోశక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మిరియాల రాజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు పళ్ళే మోహన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ బహుకరణ. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News