Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

04-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి:

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కెట్‌పల్లి మండలంలోని కామినేని హాస్పిటల్‌లో క్యాన్సర్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు పాల్గొని క్యాన్సర్ వ్యాధి కారణాలు, లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పుల ద్వారా క్యాన్సర్‌ను ఎలా నివారించవచ్చో ప్రజలకు వివరించారు.ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని వైద్యులు తెలిపారు. పొగతాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చని సూచించారు.అనంతరం నార్కెట్‌పల్లి పట్టణంలో మెడికల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ నివారణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ర్యాలీకి పట్టణ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో కామినేని హాస్పిటల్ వైద్యులు, మెడికల్ విద్యార్థులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News