Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:09 AM

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లాయోల టెక్నో స్కూల్‌లో మాక్ కోర్ట్

20-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల్లో న్యాయస్థాన విధానాలపై అవగాహన పెంపొందించేందుకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని లాయోల టెక్నో స్కూల్‌లో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన “మాక్ కోర్ట్” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాఠశాల ప్రాంగణంలో తాత్కాలిక కోర్టు వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేదికను సిద్ధం చేసి, కోర్టు వ్యవహార శైలిని విద్యార్థులకు అనుభవపూర్వకంగా చూపించారు. విద్యార్థులు న్యాయమూర్తులు, న్యాయవాదుల వేషధారణలో పాల్గొని, ఒక కేసుకు సంబంధించి వాదనలు, ప్రతివాదనలు ఎలా జరుగుతాయో సమగ్రంగా ప్రదర్శించారు. తీర్పు వెలువరించే విధానం వరకు న్యాయస్థాన ప్రక్రియను ఆవిష్కరించడం ద్వారా హాజరైన వారిలో ఆసక్తి రేకెత్తించారు.

విద్యార్థుల అభినయం, వేదిక నిర్వహణ, న్యాయపరమైన అంశాలపై వారి అవగాహన అతిథులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, కౌన్సిలర్ సత్యనారాయణ, స్థానిక ఎస్‌.ఐ. రవి కుమార్ హాజరై విద్యార్థుల ప్రదర్శనను అభినందించారు. సమాజంలో న్యాయం, సమానత్వం విలువలను చిన్ననాటినుంచేఅలవరుచుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.పాఠశాల ఛైర్మన్ ఎం.ఎఫ్. సుందర్ రాజు, ప్రిన్సిపాల్ ఎండి. జమీరుద్దీన్, డైరెక్టర్లు తీగల కిరణ్ కుమార్, మోర్తాల వెంకన్న, బెల్లం శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమంజరిగింది.ఉపాధ్యాయులు మధు, జానకి, లక్ష్మి, ఉష, సలీమా సహకారంతో విద్యార్థులు సమర్థంగానిర్వహించారు.విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Sthanikam

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లాయోల టెక్నో స్కూల్‌లో మాక్ కోర్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News