Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 28, 2026 11:46 PM

పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన - వంగర ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి యూ.సురేష్ ముఖర్జీ.

పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన - వంగర ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి యూ.సురేష్ ముఖర్జీ.

పరాకాష్టకు చంద్రబాబు దుర్మార్గ పాలన - వంగర ఎంపీపీ, జిల్లా అధికార ప్రతినిధి యూ.సురేష్ ముఖర్జీ.
February 02, 2026 06:18 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

అంబటి రాంబాబుపై హత్యాయత్నం, జోగి రమేష్ ఇంటిపై నిప్పు పెట్టడం .తక్షణం కేంద్రం, గరవ్నర్‌ జోక్యం చేసుకోవాలి,

ఆంధ్రప్రదేశ్‌లో గాడితప్పిన లా అండ్‌ ఆర్డర్‌,

లడ్డూ విషయంలో వాస్తవాలు బహిర్గతమవడంతో ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు,

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తాం,

వైసీపీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు స్పష్టీకరణ.

రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన పరాకాష్టకు చేరిందని వైసీపీ విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ.సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు మండిపడ్డారు. సోమవారం వంగర మండల కేంద్రంలో పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేయడాన్ని వీరు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వకూడదన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువుల విశ్వాసాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబే దుష్ప్రచారం చేశారన్నారు. తాజాగా సీబీఐ సిట్‌ నివేదికలో జంతువుల కొవ్వు లేదని వెల్లడైందన్నారు. నిజాలు బయటకు రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, కూటమి నాయకులు ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారని తెలిపారు. పైగా వాస్తవాలను పక్కదోవ పట్టిస్తూ ఫ్లెక్సీలు వేసి మరోసారి అసత్య ప్రచారాలకు దిగారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా పోస్టర్లు వేయించారని మండిపడ్డారు. ఫ్లెక్సీలను తొలగించడానికి వెళితే పోలీసుల ముందే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారని తెలిపారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని,పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.ఇటీవల హిందూపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై కూడా టీడీపీ గూండాలు దాడి చేశారని, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని, బీసీ నేత జోగి రమేష్ పై కూడా దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో ఫిర్యాదు చేయడాని వెళితే మాజీ హోంమంత్రి సుచరితను కూడా పోలీస్‌ కార్యాలయంలోకి అనుమతించలేదని చెప్పారు. రాష్ట్ర డీజీపీ బంట్రోతుగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై తక్షణం కేంద్రం స్పందించాలని, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని.. దౌర్జన్యాలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. కూటమి కార్యకర్తలను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీచర్స్ వింగ్ అధ్యక్షులు మరిసర్ల గంగారావు, వంగర మండల యూత్ వింగ్ అధ్యక్షులు బొక్కెల వెంకటప్పలనాయుడు, మడ్డువలస సర్పంచ్ ప్రతినిధి బురాడ వెంకట రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News