Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:50 AM

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

19-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పెండింగ్‌కు వెళ్లకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల (రెవెన్యూ) అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 29 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రజావాణిలో వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 20, పంచాయతీ శాఖకు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, ఎస్సీ వెల్ఫేర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపాలిటీ, లేబర్ శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చినట్లు అధికారులు వివరించారు.

వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను వెంటనే పరిశీలించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జయమ్మ, ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News