Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

ప్రజల కష్టాల్లో అండగా… సేవా మార్గంలో ముందున్న జీఎంఆర్ ఫౌండేషన్

19-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త నరసింహ గౌడ్ ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జీఎంఆర్ సేవా సంస్థ అధ్యక్షుడు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాసేవకుడు గుర్రపు మచ్చేందర్ గారు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి ఆదేశాల మేరకు సేవా సంస్థ సభ్యులు కుటుంబ సభ్యులను కలిసి “మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాం” అంటూ భరోసా కల్పించారు. అనంతరం కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడం తమ బాధ్యత అని సేవా సంస్థ సభ్యులు తెలిపారు. గ్రామాల్లో అవసరమైన వారికి సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ సేవా సంస్థపై గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రశంసలు కురిపించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న గుర్రపు మచ్చేందర్ సేవలను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ర్యాకల్ మాజీ సర్పంచ్ అంజన్న, సేవా సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ సాగర్, నాయకులు తుకారాం, శ్రీకాంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల కష్టాల్లో అండగా… సేవా మార్గంలో ముందున్న జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News