Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:20 PM

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్‌లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు

13-04-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పేదరికం ఆమె ప్రతిభకు అడ్డుకాలేదు.. సర్కారు చదువు ఆమె లక్ష్యానికి తక్కువ కాలేదు.. పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.​ ​రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేహశ్రీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. ​నిరుపేద కుటుంబానికి చెందిన నేహశ్రీ తన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేసింది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నేహశ్రీని గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుతో తమ గ్రామానికి, జిల్లాకు పేరు తెచ్చిన నేహశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Sthanikam

ప్రభుత్వ కళాశాల విద్యార్థిని మెరుపులు: ఇంటర్‌లో నేహశ్రీ రాష్ట్రస్థాయి ర్యాంకు

Article Image

పేదరికం ఆమె ప్రతిభకు అడ్డుకాలేదు.. సర్కారు చదువు ఆమె లక్ష్యానికి తక్కువ కాలేదు.. పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తోర్పునూరి నేహశ్రీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.​ ​రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నేహశ్రీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. ​నిరుపేద కుటుంబానికి చెందిన నేహశ్రీ తన ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తి చేసింది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా నేహశ్రీని గ్రామస్థులు, కళాశాల ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుతో తమ గ్రామానికి, జిల్లాకు పేరు తెచ్చిన నేహశ్రీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News