Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

12-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటుతూ ఘన విజయాన్ని నమోదు చేశారు.

BiPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశస్విని 1000 మార్కులకు గాను 975 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. అలాగే MPC ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నాజియా ఖాతూన్ 970 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన నాజియా ఖాతూన్ విజయ గాథ ప్రత్యేకంగా నిలిచింది. ఆమె తండ్రి అన్నారుల్ సైకిల్ పంక్చర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి సాజా ఖాతూన్ గృహిణిగా ఉన్నారు. పేదరికాన్ని జయిస్తూ నాజియా విద్యలో ప్రతిభ కనబరిచింది.

ఇతర గ్రూపుల్లో కూడా విద్యార్థులు రాణించారు:

• CECలో ఆర్. నందిని – 920/1000

• HECలో మహేష్ – 696/1000

• A&Tలో ఎం. శ్రీకాంత్ – 962/1000

మొత్తం కళాశాలలో 65% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ , అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయానికి ప్రిన్సిపాల్ మార్గదర్శకత్వం, అధ్యాపకుల కృషి ముఖ్య కారణమని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

యశస్వినికి అభినందనలు తెలుపుతున్న ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మరియు అధ్యాపక బృందం.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల, సరూర్ నగర్‌లో మెరిసిన తారాజువ్వలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News