Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

26-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం గణతంత్ర దినోత్సవ వేడుకలతో ఉత్సాహంగా మారింది. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే సందేశాన్ని అందించారు.

సమానత్వం, సౌభ్రాతృత్వమే భారత ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. లింగం, జాతి, మతం వంటి తారతమ్యాలకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగ లక్ష్యమని స్పష్టం చేశారు.

వేడుకల్లో జాతీయ కేడెట్ దళం విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. పూర్తి వందేమాతరం గీతాన్ని తెలుగు అధ్యాపకులు కృష్ణ కౌండిన్య ఆలపించగా, సభికులంతా దేశభక్తి గళంతో అనుసరించారు.చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కిషన్ గణతంత్ర దినోత్సవ చారిత్రక ప్రాధాన్యతను వివరించగా, రాజనీతిశాస్త్ర అధ్యాపకులు నరేష్ రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచన నేపథ్యాన్ని వివరించారు. పాలనాశాస్త్ర అధ్యాపకులు తాటిశెట్టి శ్రీనివాసులు గణతంత్ర దినోత్సవ మహత్తును కొనియాడారు.

తెలుగు అధ్యాపకులు ఆంజనేయులు పాడిన దేశభక్తి గీతం వేడుకలకు మరింత ఊపునిచ్చింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రదానం చేశారు.

వేడుకలను విజయవంతంగా నిర్వహించిన శారీరక విద్యా సంచాలకులు డాక్టర్ ఎం. రవీంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆంగ్ల అధ్యాపకులు రాధిక వ్యవహరించారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్రివర్ణ శోభ… గణతంత్ర దినోత్సవానికి ఘనత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News