Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:54 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

19-01-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు సమయానికి హాజరవుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. రోజువారీగా ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్‌గా ఎంతమంది రోగులు వస్తున్నారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.గర్భిణీ స్త్రీలు చెకప్‌కు ఎంతమంది వస్తున్నారని విచారించిన కలెక్టర్, ఒక గర్భిణీ మహిళతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలపై సమాచారం సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేయాల్సిన అవసరం లేదని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ప్రతి నెల ఎంతమంది ప్రసవాలు జరుగుతున్నాయన్న వివరాలను తెలుసుకున్న కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు, సిబ్బంది మరింత కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేకుండా నిరంతరం సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News