Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన

07-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాల్యవివాహాలు అనర్థాలకు దారితీస్తాయి – ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, పిల్లల, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ విభాగం సహకారంతో ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–IIల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం మాట్లాడుతూ బాల్యంలో జరిగే వివాహాలు అనేక అనర్థాలకు దారితీస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను ప్రోత్సహించకుండా నిలువరించాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత వివాహం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చని సూచించారు.వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో బాల్యవివాహాలపై అవగాహన పెంపొందించడంలో విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జెండర్ స్పెషలిస్టులు నిఖిత, భార్గవి బాల్యవివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం. అనిత, టి. శ్రీనివాసులు, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, అమర్, నరేష్, ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News