పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని 2వ వార్డులో నూతన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది.అదే విధంగా మున్సిపల్ పట్టణంలోని 2వ వార్డుకు చెందిన సుకీర్తనతో పాటు, 1వ వార్డుకు చెందిన మానెమ్మ, సంధ్య, లక్ష్మి, అనుసుజ అనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమాల్లో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2వ వార్డుకు చెందిన కాలనీవాసులు తమ ప్రాంతంలోని పలు సమస్యలను ఇటీవల ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మున్సిపల్ పట్టణంలోని చిన్నచిన్న సమస్యలు కూడా పట్టించుకోలేదని విమర్శించారు.పట్టణంలోని ప్రధాన కాలనీలలో అవసరమైన రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించకుండా గత నాయకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపడుతున్నామని, రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.పట్టణంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నివాస సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పాలన కొనసాగుతుందని తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, తాహెర్ అలీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పండరి రెడ్డి, ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీ, శంకర్ ముదిరాజ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్,నాగేష్ ముదిరాజ్,మున్సిపల్ కౌన్సిలర్లు,పట్టణ ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి