Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

ప్లాస్టిక్‌కు చెక్ చిన్నకాపర్తి గ్రామం గ్రీన్ దిశగా

09-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోని చిన్నకాపర్తి గ్రామంను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ఆవుల మాధవి తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని ఈ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ ఆధ్వర్యంలో సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి తీవ్ర హానికరమని, రాబోయే తరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని చిరు వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని సూచిస్తూ నోటీసులు అందజేశారు. గ్రామాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య, రఘు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్లాస్టిక్‌కు చెక్ చిన్నకాపర్తి గ్రామం గ్రీన్ దిశగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News