Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:38 PM

పదోన్నతి పొందిన అధ్యాపకులకు కళాశాలలో ఘన సన్మానం.

27-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు, వాణిజ్య, రసాయన, భౌతికశాస్త్ర విభాగాల అధ్యాపకులు డా. వెల్దండి శ్రీధర్, డా. జానపటి నాగరాజు, డా. అనిల్ అబ్రహం, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి సహ ఆచార్యులుగా పదోన్నతి పొందిన సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ ఘన సన్మానం నిర్వహించింది.కళాశాల సెమినార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మరియు ఇతర అధ్యాపకులు వారిని శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ అధ్యాపకులకు పదోన్నతి లభించడం కళాశాల కోసం గర్వకారణమని, వారి పరిశోధనలు, బోధనా పటిమ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు.సన్మానం పొందిన అధ్యాపకులు తమ వృత్తిపరమైన ఎదుగుదలకు తోటి అధ్యాపకులు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్తులో విద్యార్థుల ఉన్నతికి, కళాశాల అభివృద్ధికి తమ శక్తినిచ్చి కృషి చేస్తామని తెలిపారు.

అదేవిధంగా, ఇటీవల డాక్టరేట్ పొందిన కళాశాల అతిథి అధ్యాపకులు డా. మహేశ్వరి, డా. సరిత, డా. స్రవంతి లను కూడా ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాధికారి డా. డి. మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బి. నాగరాజు, స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డా. ఎ. మల్లేశం, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. జి. భాగ్యలక్ష్మి, అధ్యాపకులు డా. అనిల్ బొజ్జ, డా. ప్రసన్న కుమార్, డా. జ్యోత్స్న, స్టాఫ్ క్లబ్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Sthanikam

పదోన్నతి పొందిన అధ్యాపకులకు కళాశాలలో ఘన సన్మానం.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News