Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:35 AM

పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం

12-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన పద్మశాలి సర్పంచులకు ఘన సన్మానం

హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సర్పంచులుగా విజయం సాధించిన పద్మశాలి కులానికి చెందిన ప్రజాప్రతినిధులను అఖిల భారత పద్మశాలి సంఘం (రాజమోహల్లా) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం 11 జనవరి 2026న నిర్వహించగా, ఎన్నికల్లో గెలిచిన సర్పంచుల సేవాభావాన్ని గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వెల్లంకి గ్రామం పద్మశాలి కుటుంబానికి చెందిన శ్రీమతి ఇడెం రాధ శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి ఆమెను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని సర్పంచ్‌గా ఎన్నికవడం గర్వకారణమని పేర్కొంటూ, గ్రామాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో కందగట్ల స్వామి, జగన్నాధం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర చైర్మన్ వీరబత్తిని అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు ఎల్. రమణ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేష్, రవ్వ పాండు తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం భవిష్యత్తులోనూ ప్రజాప్రతినిధులకు అండగా నిలుస్తుందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Sthanikam

పద్మశాలి సర్పంచులకు అఖిల భారత పద్మశాలి సంఘం ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News