Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 AM

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

08-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

సమయం అత్యంత విలువైనదని, విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.

గురువారం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన అధ్యయన మెటీరియల్‌ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి వార్షిక పరీక్షలంటే చాలామంది విద్యార్థులు భయపడతారని, అలాంటి భయాలకు తావివ్వకుండా ఇచ్చిన మెటీరియల్‌ను సక్రమంగా చదివితే తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ఒక కీలక మలుపు అని, ఇక్కడ సాధించిన విజయం ఉన్నత చదువులకు బాట వేస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు జీవితంలో ఎలా స్థిరపడాలో కూడా నేర్పిస్తారని చెప్పారు. విద్యార్థులు ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండి పుస్తకాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు లేచి చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు.జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పదో తరగతి విద్యార్థులు భయపడొద్దు… కష్టపడి చదివితే విజయం ఖాయం: కలెక్టర్ హనుమంత రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News