Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 07:29 PM

పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం

23-01-2026 671 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

మదర్ డైరీ పాల ఉత్పత్తి సహకార సంఘంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మందడి ప్రభాకర్ రెడ్డి కేవలం పదహారు రోజులకే తన పదవికి రాజీనామా చేయడం పాల సంఘంలో తీవ్ర చర్చకు దారి తీసింది.సంఘ కార్యకలాపాలపై పూర్తి అవగాహన, సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రభాకర్ రెడ్డికి ఎన్నిక సమయంలో సభ్యుల్లో విస్తృత మద్దతు లభించింది. మదర్ డైరీకి కొత్త ఊపిరి వస్తుందనే రైతుల ఆశలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాంటి విభేదాలు లేకుండా ఎన్నిక సాఫీగా ముగియడం అప్పట్లో విశేషంగా నిలిచింది.అయితే బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం రైతులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసింది. పలు అనివార్య కారణాల నేపథ్యంలోనే తన ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆరోగ్యం సహకరించకపోవడంతో

తన చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు మందడి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంతో పాల సంఘం భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.

మదర్ డైరీ నిర్వహణ, రైతుల ప్రయోజనాలపై తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది.

Sthanikam

పదహారు రోజులకే మదర్ డైరీ చైర్మన్ రాజీనామా… రైతుల్లో కలవరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News