Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన
13-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,:

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో ఈరోజు ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర లోపాలు ఉన్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్, సహాయ కార్యదర్శి కె. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా, 6 వేర్వేరు వార్డుల పోలింగ్ బూత్‌లలో నమోదు కావడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు విభిన్న బూత్‌లకు వెళ్లాల్సి రావడం వల్ల ఇబ్బందులు అధికమవుతున్నాయని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

ఎన్నికల నియమావళి ప్రకారం ఓటరు తన నివాస వార్డు పరిధిలోని పోలింగ్ బూత్‌లోనే నమోదు కావాలని స్పష్టం చేస్తూ, వెంటనే లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి. అంజిత్ గౌడ్, కే. లింగప్ప, డీహెచ్‌పీఎస్ అధ్యక్షులు కొత్తూరు ఈరన్న, కార్యదర్శి ఏ. విజయ్ కుమార్, లక్ష్మన్న, నూకన్నా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల జాబితాలో గందరగోళం – సీపీఐ ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News