Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:52 AM

ఓవైసీ సంచలన హెచ్చరిక: "నల్గొండ మేయర్‌కు మా అనుమతి లేకుండా రాలేడు!"

02-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఓవైసీ సంచలన హెచ్చరిక: "నల్గొండ మేయర్‌కు మా అనుమతి లేకుండా రాలేడు!"

నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మన పర్మిషన్ లేకుండా నల్గొండలో మేయర్ ఎవరూ కాలరు" అని గట్టిగా హెచ్చరించారు. పార్టీ కార్పొరేటర్లు, వక్ఫ్ భూములు, మైనారిటీల హక్కులు కాపాడేందుకు AIMIM పోరాడుతుందని స్పష్టం చేశారు.ఓవైసీ మాటల్లో, "డబ్బలు ఎవరు ఇచ్చినా తీసుకోండి. 9 మంది AIMIM కార్పొరేటర్లను గెలిపించండి. ప్రత్యర్థులు ఓట్ల కోసం డబ్బులు పంచితే బాత్రూము రిపేర్ చేసుకోండి, కానీ ఓటు మాజ్లీస్‌కే వేయండి" అని పిలుపునిచ్చారు. నల్గొండలో 26 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని కాపాడినట్టు చెప్పుకున్నారు. "కొన్ని అతీత శక్తులు దాన్ని కాజేయాలని చూస్తున్నాయి. మనం AIMIM కాపాడాం" అని ఆరోపించారు.అభ్యర్థుల గురించి ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "వేరే ముసుగులో మన వారే ఉన్నారు, కానీ వారి నోటికి తాళాలు వేస్తాము" అని చెప్పారు. లతీఫ్ షా దర్గా రోడ్డుకు NOC ఇవ్వొద్దని కొట్టారని, మీ ఓటు మీ నల్గొండ వక్ఫ్ కోసం వేయండని పిలుపునిచ్చారు. "మాజ్లీస్ సైనికులు నిలుస్తారు" అని ధైర్యం పెంచారు.ఓవైసీ BC, SC, ST, మైనారిటీల కోసం AIMIM పోరాడుతుందని స్పష్టం చేశారు. బీహార్‌లో నలుగురు అభ్యర్థులను లాకున్నారని, MIM పని ఆగిపోతుందని అనుకున్నారని గుర్తు చేశారు. కానీ బీహార్‌లో 25 మంది, ఔరంగాబాద్‌లో 33 మంది గెలిచారు. ముంబైలో 33 మంది, మహారాష్ట్రలో 125 మంది కార్పొరేటర్లను గెలిపించి MIM సత్తా చాటారని పేర్కొన్నారు. తెలంగాణలో నల్గొండలో AIMIM అభ్యర్థులకు ప్రత్యర్థులు డబ్బులు పంచుతే తీసుకోవాలని, ఓటు మాజ్లీస్‌కే వేయాలని ఓవైసీ సూచించారు. దేశ చరిత్రలో భగత్ సింగ్‌ను కన్నట్టు సుల్తాన్‌ను కూడా కన్నదని, మేము తక్కువ మంది అయినా BJP వారు ఎందుకు భయపడుతున్నారో తెలుసని ఎద్దేవాచేశారు. నల్గొండ ఎన్నికల్లో AIMIM పోటీ చేస్తున్న అభ్యర్థులు వక్ఫ్ భూములు, మైనారిటీ హక్కులు, స్థానిక సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఓవైసీ వ్యాఖ్యలు ప్రజల్లో ఉత్సాహాన్ని మేల్కొలిపాయి. పార్టీ కార్యకర్తలు, మైనారిటీ ప్రజలు ఓవైసీ పిలుపుకు స్పందిస్తూ AIMIM అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.ఈ వ్యాఖ్యలతో నల్గొండ ఎన్నికల్లో AIMIM పోటీ మరింత తీవ్రమవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJP అభ్యర్థులకు AIMIM మరింత సవాలుగా మారనుంది. ఓవైసీ డబ్బులు తీసుకోండి, ఓటు మాజ్లీస్‌కే అనే వ్యూహం ప్రజల్లో చర్చనీయాంశమైంది. మైనారిటీ ఓట్లు ఎలా పడతాయో అనేది రసాంతం. ఓవైసీ మాటలు నల్గొండలో AIMIM ప్రచారానికి బలం చేకూర్చాయి. వక్ఫ్ భూముల కాపాడటం, దర్గా రోడ్డు NOCలు, మైనారిటీల సమస్యలపై AIMIM దృష్టి పెట్టడం ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తోంది. బీహార్, మహారాష్ట్రలోని విజయాలను ఉదాహరణగా చెప్పి తెలంగాణలో కూడా విజయం సాధిస్తామని ఓవైసీ ధైర్యం, ఉత్సాహం పెంచారు.

Sthanikam

ఓవైసీ సంచలన హెచ్చరిక: "నల్గొండ మేయర్‌కు మా అనుమతి లేకుండా రాలేడు!"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News